“ఇక ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది”..డైరెక్టర్లకు చమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న తెలుగు స్టార్ హీరోలు ..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలను సోషల్ మీడియాలో జనాలు ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ఒక స్టార్ కోసం రాసుకున్న కథను మరొక స్టార్ చేస్తే ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మేకర్స్ డైరెక్ట్ గానే పలానా పెద్ద హీరో ఈ సినిమా రిజెక్ట్ చేశారు అంటూ హింట్ ఇస్తున్నారు. ఇక అంతే ట్రోలర్స్ మీమర్‌స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు .

ఇలాంటి ట్రోలర్స్ వీమర్స్ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి టాలీవుడ్ స్టార్ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇకపై సినిమాకి కమిట్ అయ్యే ముందే అగ్రిమెంట్ లో కొత్త నోట్ యాడ్ చేయబోతున్నారట. సినిమాకి కమిట్ అయిన తర్వాత ఏ కారణం చేతనైనా సరే ఆ సినిమా నుంచి తప్పుకున్న లేక ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీటెయిల్స్ బయటకు రాకుండా ఉండేలా సరికొత్త అగ్రిమెంట్ నోట్ ని క్రియేట్ చేయించుకుంటున్నారట.

ఈ ఒక్క పాయింట్తో ఇక మేకర్స్ ఒళ్ళు కంట్రోల్ పెట్టుకొని స్టేజిపై మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటున్నారు జనాలు . టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండడం గమనార్హం. ఇది స్టార్ హీరోలను సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ నుంచి బాగా కాపాడుతుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఈ నిర్ణయం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..??