“ఆ ఉసురు తగిలే విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయ్యింది”.. నటి సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

పాపం .. విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణాతి దారుణంగా డిజాస్టర్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఫస్ట్ డే విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా కలెక్షన్స్ అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి . అసలు విజయ్ దేవరకొండ సినిమానేనా..? ఇది.. ఆయన రేంజ్కి ఈ సినిమా ఏంటి..? ఈ కలెక్షన్స్ ఏంటి ..? అంటూ మండిపడుతున్నారు. పరశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయిన ఈ సినిమా పరమ చెత్త టాక్ ను దక్కించుకునింది .

అయితే అసలుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిపోయింది అన్న బాధలో ఉన్న క్రమంలో ఓ నటి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకి ఇంకా కోపం తెప్పిస్తుంది. సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్ గా పేరు సంపాదించుకున్న ఆశా బొర్రె విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది . అయితే ఆమె చాలా ఎక్కువ సినిమా భాగంలో భాగమైనట్లు కానీ ఎడిటింగ్లో ఆమె పాత్రను లేపేసినట్లు ఆమె పెట్టిన పోస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆమె తన పోస్టులో ఓ రేంజ్ లో సినిమా టీం పై మండిపడింది.

” హైదరాబాదులో జనాలు లేరనుకున్నారో.. లేకపోతే ఇంటర్నెట్లో పాపులారిటీ సంపాదించుకున్న ఫేస్ కావాలి అనుకున్నారు ఏమో నన్ను బాగా వాడుకున్నారు ..సినిమా లో నటించాలి అంటూ పదేపదే ఫోన్లు చేసి నా చేత కమిట్మెంట్ తీయించుకొని .. నా హెల్త్ బాగో లేకపోయినా కష్టపడి షూటింగ్ కు వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. కనీసం ఇస్తానన్న రెమ్యూనరేషన్ లేదు హోటల్ ఖర్చులు లేవు.. అసలు మనిషి ఉన్నారో పోయారో పట్టించుకునే దిక్కేలేదు ..

మరి ఎందుకు ఆ హంగామా ..? ఎందుకు మరి అన్ని ఫోన్లు ..? మీకు మీ ఎడిటింగ్ కి దండం రా బాబు.. మరోసారి నా కళ్ళు తెరిపించారు .. ఇకపై జాగ్రత్తగా ఉంటాను ” అంటూ ఓ రేంజ్ లో మండిపడింది . అయితే ఆశా పోస్టు వెనక ఎంతో బాధ ఉంది అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు జనాలు . ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ అని..ఆమె ను ఏడిపించుకున్న కారణంగానే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ పలువురు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాను ట్రోల్ చేస్తున్నారు..!!