మొన్న లైగర్..నేడు ఫ్యామిలీ స్టార్.. విజయ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదేనా..?

సోషల్ మీడియాలో ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ పేరును జనాలు ఏ విధంగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారో మనకు తెలిసిందే. పాపం విజయ్ దేవరకొండ టైం అస్సలు బాగోలేదు అని చెప్పాలి . ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణాతి దారుణమైన రిజల్ట్ ను దక్కించుకునింది . పరశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ .

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయి పరమ చెత్త టాక్ దక్కించుకుంది. కొంతమంది ఫ్యామిలీ స్టార్ సినిమా బాగుంది అంటున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా కూడా విజయ్ దేవరకొండ రేంజ్ ను రీచ్ కాలేకపోయింది. కేవలం 5.85 కోట్లతోనే సరిపెట్టుకునింది ఈ మూవీ . ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.

గతంలో లైగర్ సినిమా విషయంలో చేసిన తప్పే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చేశాడు అని ఆ కారణంగానే రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి అని చెప్పుకొస్తున్నారు . అర్జున్ రెడ్డి లాంటి సినిమా చూసిన తర్వాత ఆ స్థాయి కధలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అభిమానులు . అంతేకాదు అంత బోల్డ్ కంటెంట్ కాకపోయినా ఆ రేంజ్ ఆఫ్ కథలను చూస్ చేసుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా తన బాడీకి సూట్ కాని రోల్స్ కి ఎందుకు విజయ్ దేవరకొండ సైన్ చేస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు . ఫ్యామిలీ స్టార్ అనేది యావరేజ్ హీరో చేసే సినిమా అని అలాంటిది పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ చేస్తే సినిమా ఫ్లాపే అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!