లవర్ ని మెయిన్ టైన్ చేస్తున్న నాగచైతన్య.. డౌట్ వచ్చిన నాగార్జున ఏం చేశాడు అంటే..?

నాగచైతన్య .. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారడానికి బాగా కష్టపడుతున్న హీరో . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు . అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చూశాడు. రీజన్ ఏంటో తెలియదు కానీ నాగచైతన్య ఒక్కటంటే ఒక్కటి కూడా సొంతంగా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు . నాగచైతన్య తన కెరియర్లో హిట్స్ అందుకున్నాడు . కానీ అవన్నీ కూడా స్టోరీ హిట్ అవ్వడం వల్ల.. హీరోయిన్ నటించిన కారణంగా మాత్రమే హిట్ అయ్యాయి అని..

తన నటన టాలెంట్ తో హిట్ అయిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి లేవు అంటూ ఇప్పటికీ జనాలు ఆయనను ట్రోల్ చేస్తూనే ఉంటారు . కాగా గతంలో ఓ ఈవెంట్లో నాగార్జున ..నాగచైతన్య పై చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అఫ్ కోర్స్ వాళ్ళ మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు .

అయితే ఒక ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ..” నాగచైతన్య ఎవరినో లవ్ చేస్తున్నాడు అనే డౌటు వచ్చింది అని.. ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉండడం అందరితో కాకుండా దూరంగా ఇంటికి ఉంటాను అంటూ ఫ్లాట్ తీసుకుని ఉండడం .. ఆ టైంలోనే ఎక్కడో తేడా కొట్టింది అని .. డౌట్ వచ్చి ఇంటి పని వాళ్ళని కూడా ఆరా తీశానని ..కానీ వాళ్ళు కూడా తనకు ఏ విషయం చెప్పలేదు అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు నాగార్జున “. ఆ టైంలో నాగచైతన్య సమంత కూడా పక్కపక్కనే ఉండడం గమనార్హం. దానికి సంబంధించిన న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!