అదే నిజమైతే ఈసారి ఏపి ఎన్నికల్లో ఓడిపోయేది ఆ పార్టీనే.. ఇలా దొరికిపోయావు ఏంటి లాస్య..?

కొద్దిరోజులే ..కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి . ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమదైన స్టైల్ లో స్ట్రాటజీలను ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో యాంకర్ లాస్య ను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . అయితే ఆమె ఏదో తన పర్సనల్ విషయం కారణంగా ట్రోలింగ్కి గురైతే పర్లేదు.. ఏపీలో ఎన్నికలకు ఆమె సపోర్ట్ చేస్తూ ఓ పార్టీని సపోర్ట్ చేస్తూ ట్రెండ్ చేసిన కారణంగానే ఆమెను ఓ రేంజ్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.

గతంలో యాంకర్ లాస్య తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో బీఆర్ఎస్ పార్టీకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణాతి దారుణంగా ఓడిపోయింది . ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో లాస్య వైసిపి పార్టీకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో లాస్య హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది .

లాస్య ఐరన్ లెగ్ నిజమే అయితే కచ్చితంగా నెక్స్ట్ ఏపీలో ఓడిపోబోయేది వైసిపి నే అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు జనాలు . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను మనం ఎక్కువగా వింటున్నాము. కేవలం లాస్య అనే కాదు పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని కూడా ఎన్నికల సందర్భంగా ట్రోలింగ్ గురి చేస్తున్నారు వివిధ పార్టీ అభిమానులు . చూద్దాం మరి ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ..? సీఎం పదవిని ఎవరు చేపడతారో..?