“ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది కేవలం దానికోసమే”.. జూ.ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ .. పరిచయం చేయక్కరలేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీబిజీగా ముందుకు వెళుతున్నాడు . ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయిన అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు .

కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ భారీ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. టిడిపికి ప్రచారం చేస్తున్న మూమెంట్లో ఎన్టీఆర్ దారుణాతి దారుణమైన యాక్సిడెంట్ కు గురయ్యారు . జస్ట్ మిస్ ఆ దేవుడే ఆయన ప్రాణాలను కాపాడాడు . అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది .

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు జనాలు . “ఆ టైంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.. కానీ ఒక్కటి మాత్రం నమ్మాను ..నేను చనిపోను నాకు ఆ విషయం తెలుసు. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి అనే నమ్మకం నాలో ఉంది .. ఆ దృఢ సంకల్పమే నన్ను బతికించింది ” అంటూ చాలా చాలా మోటివేషనల్ గా మాట్లాడారు . ఆ ప్లేస్లో మిగతా ఎవ్వరు ఉన్న సరే భయపడిపోయేవారు . నోట మాట వచ్చేది కాదు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా బోల్డ్ గా మాట్లాడి షాక్ ఇచ్చారు..!!