ప్రతి అల్లు అర్జున్ నిజమైన ఫ్యాన్ ఆయన బర్త డే కి అలా చేయాల్సిందే..ఏం ఐడియా రా బాబు..!

సాధారణంగా తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజుకి అభిమానులు ఏ రేంజ్ లో హంగామా చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే . కొంతమంది భారీ భారీ కటౌట్లతో ట్రెండ్ చేస్తూ ఉంటారు . మరి కొంతమంది అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్ పార్టీలు చేస్తూ ఫ్లెక్సీలతో నానాహంగామ చేస్తూ ఉంటారు. తమ ఫేవరెట్ హీరో ఫోటోను డీపీ గా మారుస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది అభిమానులు .

అయితే ఈసారి అల్లు అర్జున్ బర్త్ డే కు సరికొత్త ట్రెండ్ సృష్టించేలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సరికొత్త ఐడియాను ముందుకు తీసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తేదీ . అయితే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డ డే హాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . అయితే రీసెంట్గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కామన్ డిపి గా పెట్టుకోవాలి అంటూ ఒక ఫోటోను రిలీజ్ చేశారు గీత ఆర్ట్స్ .

ఈ కామన్ డిపి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉండే ఈ పిక్ ను చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ ఈ పిక్ ను డిపి గా పెట్టుకోవాలి అని సజెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే వార్త ఎక్కువగా వైరల్ గా మారింది . అంతేకాదు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప2 సినిమాకి సంబంధించిన భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు . ఇప్పటికే అన్ని రెడీ చేసుకున్నారు మేకర్స్..!