ఉదయ్ కిరణ్ లేడి గెటప్ లో నటించిన వన్ అండ్ ఓన్లీ మూవీ ఇదే..కానీ అదే మైనస్..!

సినిమా ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అప్పట్లో ఎంతమంది యంగ్ హీరోస్ ఉన్నా సరే కాలేజీకి వెళ్లే అమ్మాయిలు చాలామంది ఉదయ్ కిరణ్ ఫేవరెట్ హీరోగా చెప్పేవారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా బాగా పాపులారిటి సంపాదించుకున్నాడు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయిన ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అన్న సంగతి మనకు తెలిసిందే.

ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించాడు .. ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. కాగా రీసెంట్ గా ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మళ్లీ రిలీజ్ చేశారు . ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ ప్రిషియస్ పిక్స్ ను ట్రెండ్ చేస్తూ వచ్చారు అభిమానులు. రీసెంట్ గా ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

అసలు ఉదయ్ కిరణ్ ని ఇప్పటివరకు మనం ఎప్పుడూ కూడా ఆ గెటప్ లో చూడలేదు . అయితే ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించిన సినిమా ఏంటా..? అంటూ ఆరా తీయడం ప్రారంభించారు అభిమానులు . జోడి నెంబర్ వన్ అనే సినిమాలో ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించారు . అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాలోని కొన్ని పిక్చర్స్ ని నెట్టింట అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . అందులో ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో ఉన్న కొన్ని పిక్స్ కూడా బాగా వైరల్ గా మారాయి..!