నక్క తోక తొక్కిన ప్రశాంత్ వర్మ.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడుగా..!

ఏ నక్క తొక్క తొక్కేడో తెలియదు కానీ అద్దిరిపోయే ఆఫర్ ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ అంటున్న న్యూస్ ఇప్పుడు ఓ రేంజ్ లో బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . జనరల్ గా ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు సినిమాలు హిట్లు పది సినిమాలు ఫ్లాప్ అయితేనే ఆ డైరెక్టర్ స్టార్ గా మారగలడు . అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా మారడం అనేది చాలా చాలా రేర్.

అలాంటి ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా ఇప్పుడు ఆయన మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేశాడు అంటూ బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా హీరో అయిన రన్వీర్ సింగ్ తో మూవీ అవకాశాన్ని పట్టేశాడు ప్రశాంత్ వర్మ అన్న న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

రణవీర్ తో సినిమా అంటే మాటలు కాదు బడా బడా డైరెక్టర్స్ కొన్ని సంవత్సరాలుగా ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు . అలాంటిది ప్రశాంత్ వర్మ ఎలా ఆయన ఆఫర్ పట్టేయగలిగాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు ఈ ఆఫర్ రావడం నిజంగా ఆయన అదృష్టం అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో ప్రశాంత్ వర్మ..???