బుచ్చి బాబు బ్రెయిన్ దొబ్బిందా..? చరణ్ కి తాత గా ఆ స్టార్ హీరో నా..?

తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అస్సలు తెలియడం లేదు కానీ కొన్ని నిర్ణయాలు మెగా ఫాన్స్ కు మండించేలా తీసుకుంటున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. డైరెక్టర్ గా పెద్దగా అవగాహన లేదు.. తోపు అయిన డైరెక్టర్ అని కూడా చెప్పలేం.. చేసింది ఇప్పటివరకు ఒక్కటి అంటే ఒక్కటే సినిమా .. అది కూడా ఉప్పెన . ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఎలాగోలా రామ్ చరణ్ తో క్రేజీ ఆఫర్ పట్టేసాడు .

పూజా కార్యక్రమాలు కూడా జరిపించేసాడు . ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ అయి వైరల్ గా మారింది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ తాత పాత్రలో కనిపించబోతున్నాడట .

అంతేకాదు ఈ పాత్ర సగం లో చనిపోతుందట . బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన అమితాబచ్చన్ తాత పాత్రలో కనిపిస్తూ ఉండడం ఒక నెగిటివ్ పాయింట్ అయితే.. సగం లోనే ఆ క్యారెక్టర్ ని చంపేయడం మరొక నెగిటివ్ గా మారబోతుంది సినిమాకి అంటూ ప్రచారం జరుగుతుంది . కొందరు మెగా ఫాన్స్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు. బ్రెయిన్ దొబ్బిందా ..? అంటూ ఒకరు ఇలాంటి చెత్త కథ మా హీరోతో తెరకెక్కిస్తావా ..? అంటూ మరొకరు దారుణంగా ఏకేస్తున్నారు..!!