కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు అలాంటి కండిషన్స్ పెడుతున్న సమంత.. ఇక చచ్చిన ఏ డైరెక్టర్ అవకాశం ఇవ్వడు పో..?!

సమంత .. ఇండస్ట్రీలో ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ . ఇది ఒకప్పటి పేరు ..ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్కి గురవుతున్న పేరు.. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ సమంత తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఆమె కెరియర్ను ఇంకా ఇంకా పాతాళానికి పడిపోయేలా చేస్తున్నాయి . అసలకే నాగచైతన్యతో విడాకుల తర్వాత పరిస్థితి అంతంతగా మారిపోయింది. అంతేకాకుండా అమ్మడు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి కూడా గురైంది .

ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి బయటపడి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు దక్కించుకునేలా చేస్తుంది. కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మించాలి అంటూ డిసైడ్ అయింది .రీసెంట్ గానే అట్లీ – అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే కొత్తగా తెలుగు సినిమాలకు కమిట్ అవ్వాలి అంటే సమంత క్రేజీ కండిషన్ పెడుతుంది అన్న వార్త టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సమంతకి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది మనకు తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పటి ఫ్యాన్ ఫాలోయింగ్ . ఇప్పుడు మాత్రం సమంత పేరు చెప్తే ఆ సమంతా..? అని సాగదీసే జనాలే ఉన్నారు . సమంత ఫస్ట్ హీరోయిన్ రోల్ అయితేనే ఓకే చేస్తుందట.. సెకండ్ హీరోయిన్ రోల్ అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేస్తుందట . ఇది చాలా దారుణం ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉందా ..?లేదా..? అన్నది చూసుకుంటేనే సమంత కెరియర్లో ముందుకు వెళ్లగలదు అంటూ సూచిస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం మరి సమంత ఎలా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తుందో..?