అరుదైన గౌరవాన్ని అందుకున్న నాని ‘ హాయ్ నాన్న ‘.. సరికొత్త రికార్డ్..

నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ తో రిలీజ్ చేయగా.. ఈ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

Hi Nanna Telugu Glimpse | Nani | Mrunal Thakur | Shouryuv | Hesham Abdul Wahab | Sanu John Varghese

ఇక ఎథెన్స్‌ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫీలిమ్‌ ఫెస్టివల్ లో ఉత్తమ ఫీచర్ ఫిల్లింగ్‌గా ఈ సినిమాకు అవార్డు దక్కింది. దసరా తర్వాత 2023లో నాని సాధించిన రెండో బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాగా హాయ్ నాన్న నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నాని నటనకు ఎమోషనల్ నరేషన్‌కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాకు అంతర్జాతీయ అవార్డ్‌ అందిందని తెలియడంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు శౌర్యవ్‌ ఈ సినిమాను హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాడు.

Nani Writes 'Hi Nanna' Review Well In Advance

నాని తనదైన స్టైల్ లో.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మృణాల్‌ ఠాగూర్ ప్రేక్షకులను మెప్పించింది. నాని కూతురుగా తన క్యూట్ నటనతో కియారా ఖ‌న్నా కట్టిపడేసింది. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఓటీటీ లోను ఈ సినిమా అదే రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఏడాది జనవరిలో నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేశారు.