వాట్.. రాజమౌళితో సినిమాలో నటించడం వల్ల ఈ టాలీవుడ్ హీరోలు సినీ కెరీర్ కోల్పోయారా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న తన‌ మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలిన‌ అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆయన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ చేసేందుకు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సినిమాతో కూడా రాజమౌళి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాడని ప్రేక్ష‌కులు న‌మ్ముతున్నారు.

Santhosh47 on X: "CDP for #SYE movie anniversary trend 😎😎😎😎😎  #16YearsForSYE https://t.co/P1w1w7NOiQ" / X

ఇలాంటి క్రమంలో రాజమౌళితో సినిమా తీసిన ఇద్దరు హీరోలు ఆ సినిమాల‌ కారణంగా తమ సినీ కెరీర్ కోల్పోయారంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇంత‌కి ఆ ఇద్దరు హీరోలు ఎవరు.. వారి కెరీర్ నాశనం కావ్వడానికి రాజమౌళి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. మొదట యంగ్ హీరో నితిన్ రాజమౌళితో సై సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. దీంతోపాటు నితిన్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన తర్వాత నితిన్ ఎన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. దీంతో 14 ఫ్లాప్ లను ఎదుర్కొన్న నితిన్.. విక్రం.కే డైరెక్షన్‌లో వచ్చిన ఇష్క్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని హీరోగా తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు.

Prime Video: Maryada Ramanna

ఇదిలా ఉంటే ఇక రాజమౌళి డైరెక్షన్లో సునీల్, సలోని జంటగా మర్యాద రామన్న సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. అప్పటివరకు కమెడియన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్.. ఈ సినిమాలో హీరో గాను అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో ప్రేక్షకుల్లో సునీల్ పై మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో సునీల్ నటించిన సినిమాలు ఏవి మర్యాద రామన్న పోలి లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని తీసుకోలేకపోయారు. దీంతో సునీల్ హీరోగా సినీ కెరీర్ లో సక్సెస్ కాలేకపోయాడు. అందుకే ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.