మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ఈ గింజలతో మాయం చేసుకోండి..!

మలబద్ధకం ఈజీగా తగ్గటానికి కొన్ని విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదిలికలను నియంతరిస్తుంది. జీర్ణ క్రియను ప్రోత్సాహిస్తుంది. వీటిల్లో ఉండే ఓమేగా-3 ఫ్యాటి మా సీడ్ లు సోదానిరోదక లక్షణాలను కలిగి ఉంటాయి.

మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. చియా సీడ్స్ లో ఫైబర్ బాగుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. పేగు కదలికలు బాగుండేలా చేసి మలాన్ని మృదువుగా చేస్తుంది. సైలియం గింజల్లో కరిగే ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది నీటిని గ్రహిస్తుంది.

పేగుల్లో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పర్చి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే సహజమైన నూనెలు పేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పోద్దుతిరుగుడు విత్తనాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాల్లో నూనెలు కూడా పేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తాయి.