వార్ 2 నుండి లీకైన క్రేజీ పిక్స్.. బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్.. వేరే లేవల్ లో ఉన్నాడుగా..!

జూనియర్ ఎన్టీఆర్ .. ప్రజెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే . ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి దేవర సినిమాకి కమిట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నారు . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు .

అయ్యాన్ ముఖర్జీ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకొని సరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ మూవీ. తాజాగా ఈ మూవీలోకి అడుగు పెట్టారు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ . దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి .

అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమాలో బీస్ట్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ వైరల్ గా మారింది . ఈ షూటింగ్ సెట్స్ నుంచి రెండు ఫోటోలు నెట్టింట లీకై వైరల్ గా మారాయి. ఆ పిక్స్ లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కనిపిస్తున్నారు . హృతిక్ రోషన్ బుల్లెట్ జాకెట్ ధరించి టీ తాగుతున్నట్లు మనకు కనిపిస్తే ఎన్టీఆర్ బ్లాక్ టీషర్ట్ లో నడుస్తూ చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఈ పిక్స్ చూసిన జనాలు వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని .. తాజాగా లీక్ అయిన పిక్చర్స్ ఆధారంగా తెలిసిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ వార్ 2 సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి..!