అమ్మ బాబోయ్.. కంటి చూపుతోనే చరణ్‌ ని ఉపాసన ఎలా కంట్రోల్ లో పెట్టిందో చూడండి..మెగా కోడలు సైగలు వీడియో వైరల్..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న రాంచరణ్ అలాగే ఆయన సతీమణి ఉపాసనకు సంబంధించిన ఒక క్యూట్ రేర్ వీడియో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ రీసెంట్గా చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నాడు . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. చాలామంది మెగా ఫాన్స్ మెగా అభిమానులు శ్రేయోభిలాషులు ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . కొందరు అసలు ఆయనకు డాక్టరేట్ రావడం పట్ల విష్ కూడా చేయలేదు.

అది వేరే మ్యాటర్ .. అది పక్కన పెడితే రామ్ చరణ్ స్టేజ్ మీద కూర్చొని ఉండగా ఉపాసన స్టేజి ఎదురుగా ఆడియన్స్ లో కూర్చొని ఉంది . అప్పుడే ఉపాసన చరణ్ కి ఏదో నోటితో సైగలు చేసి చెప్తున్నట్లు కనిపిస్తుంది. దానికి రామ్ చరణ్ కూడా ఏదో తనదైన స్టైల్ లో సైగలు చేస్తూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఓ పక్కన అంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే కాసేపు ఇలా సైగలు చేసుకొని మాట్లాడుకోవడం.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంతమంది ఈ వీడియోని క్యూట్ గా ఉంది బెస్ట్ కపుల్ అంటుంటే .. మరి కొంతమంది ఉపాసన చరణ్ ని కంటిచూపుతోనే కంట్రోల్లో పెట్టేస్తుంది అని .. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . భార్యాభర్తలు అన్నాక ఇలాంటి సైగలు చాలా కామన్ ఆ విషయం అర్థం చేసుకొని ఈ ట్రోలింగ్ ఆపేస్తే బెటర్ అంటున్నారు మెగా అభిమానులు. ప్రెసెంట్ వీళ్ళకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారిపోయింది . రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకున్నాడు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పై కి తీసుకురాబోతున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది..!!