దేవర నుండి అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేస్తుందోచ్..పండగ చేసుకోండి రా ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. సంచలన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన లీక్ అయిన ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం అవధులు దాటిపోతూ ఉంటుంది . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో జాన్వి కపూర్ క్యారెక్టర్ చనిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే రెండవ పార్ట్ లో మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దింపబోతున్నాడట కొరటాల శివ. అయితే దేవర నుంచి ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్డేట్ రిలీజ్ అవ్వలేదు . ఫ్యాన్స్ చాలా డీలా పడిపోతున్నారు.

అసలు అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలన రికార్డ్స్ నెలకొల్పి ఉండేది . కొన్ని కారణాల చేత అది బ్రేక్ అయింది . దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక న్యూస్ లీకై వైరల్ గా మారింది. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అద్భుతమైన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్.

ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలి అంటూ తారక్ కోరడంతో కొరటాల శివ ఓకే చేశారట. ఇది నిజంగా నందమూరి అభిమానులకి హ్యాపీనెస్ క్రియేట్ చేసే న్యూస్ అనే చెప్పాలి . మే 20వ తేదీ దేవర హవ ఎలా ఉంటుందో ఇప్పటినుంచే మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు నందమూరి అభిమానులు..!!