నయనతర పెట్టుకున్న ఈ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా..? స్టార్ హీరోలు కూడా వేస్ట్..!

నయనతార .. సౌత్ ఇండియాలోనే క్రెజిస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్.. అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. టాలెంటెడ్ హీరోయిన్ .. సినిమాల్లో ఎవరైనా సరే తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తారు. కానీ సినిమా కథలు విని ఆ సినిమా హిట్ అవుతుందా ..? ఫ్లాప్ అవుతుందా..? అని చెప్పే సత్తా ఉన్న హీరోయిన్స్ కొంతమంది ఉంటారు . అలాంటి హీరోయిన్స్ లో మన నయనతార కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .

నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత సరోగసి ప్రాసెస్ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు విగ్నేష్ – నయనతార . ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా లీడ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే మంచి మంచి సినిమాలతో మన ముందుకు రాబోతున్నట్లు హింట్ ఇస్తున్నారు . తాజాగా నయన్ వాచెస్ కలెక్షన్స్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి .

నయనతార ఎంత చక్కగా రెడీ అయిన చేతికి వాచ్ మాత్రం చాలా స్పెషల్గా ఉన్నదే పెట్టుకుంటూ ఉంటుంది . ఈ క్రమంలోనే ఆమె వాడే ప్రతి లగ్జరీ వాచ్ గురించి జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు . నయనతార వద్ద దుస్తులు అన్నీ బ్రాండెడ్ వే ఉంటాయి. అయితే వాచెస్ అంటే మాత్రం నయనతారకు మహా మహా పిచ్చట . లగ్జరీ వాచీలు అమ్మే వెబ్సైట్ ప్రకారం నయనతార పెట్టుకున్న వాచ్ రోలెక్స్ వాచ్ అని తెలుస్తుంది .

దీని ఖరీదు దాదాపు 70 లక్షల పైగానే ఉంటుందట . అయితే ఇందులో కూడా మోడల్ బట్టి ధరల్లో మార్పు ఉంటుందట . అంతేకాదు నయనతార వద్ద అలాంటివి 10 – 15 గానే ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు రీసెంట్గా నయనతార బర్త డే సందర్భంగా భర్త విగ్నేశ్ ఆమెకు ఇష్టమైన ఎంతో లగ్జరీయస్ కారును గిఫ్ట్ చేశారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ నయనతార విగ్నేశ్ శివన్ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!