మామిడి పూత‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది. మామిడి పండ్లను ఇష్టంగా తినేవారికి ఇది పెద్ద గుడ్ న్యూస్. పండ్ల లో రారాజైన మామిడి పండ్ల‌ని ఇష్టంగా తిన‌నివారు ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు.. అయితే, మామిడి పండ్లను తింటే స‌గ్గ‌డ్డలు వస్తాయని, బాడీలో హిట్ పెరిగి చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయని చాలామంది భయపడతారు. కానీ మామిడి పండ్లు మ‌న‌వ శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మామిడి పండ్లే కాదు.. మామిడి పూత‌ కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెప్తునారు. వేసవి కాలంలో చాలా మంది బాడీ హీట్‌.. ముక్కుదిబ్బడ సమస్యల‌తో ఇబ్బందిపడుతుంటారు. వేడి వల్ల ఈ సమస్య వస్తే, మామిడి పూత‌ వాసన ఈ సమస్యకు చెక్ పెడుతుంది. మామిడి పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాక‌రించేదుకు ఎన్నో లక్షణాలను కలిగి ఉంటుంది.

మామిడి పువ్వుల పొడిని తయారు చేసి ప్రతిరోజూ ఉదయం ఒక చెంచాడు నీటిలో క‌లిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లేదా మామిడి పువ్వు రసం తీసి ఉదయాన్నే సేవించవ‌చ్చు. ఇది షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఈ రోజుల్లో ఎసిడిటీ సమస్య అందరిలోనూ కామన్‌గా మారిపోయింది. ఈ సమస్యను దూరం చేయడానికి మామిడి పువ్వు రసం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇది జీర్ణవ్య‌వ‌స్థ‌ను మెరుగుపరిచి.. గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఈమధ్య కాలంలో జంక్ ఫుడ్, బయట ఇత‌ర ఆహారాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల చాలా మందికి బరువు సమస్య ఏర్స‌డుతుంది.

బరువు తగ్గటానికి మామిడి పువ్వు రసం సేవించింది. దీని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొల‌స్ట్రాల్‌ కూడా అదుపులోకి వస్తుంది. వేసవిలో చాలా మందికి కడుపునొప్పి సమస్య సాధారణంగా మారిపోయింది. విరేచనాలు, అసిడిటీ, డీహైడ్రేషన్ ఇలా అనేక ర‌కాల‌ జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి. అటువంటి పరిస్థితుల్లో మామిడి పువ్వును తినడం చాలా మంచి ప్ర‌యోజ‌నాల‌నిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి మామిడి పువ్వులను సేవించండి. దీని కోసం మామిడి పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత దీన్ని వడగట్టి ఉదయాన్నే సేవించాలి. మామిడి పువ్వులు ప్రకృతి చల్లదనాన్ని కలిగి కడుపులో వేడి స‌మ‌స్య‌నుంచి ఉప‌స‌మ‌నం ఇస్తాయి.