“కంగ్రాట్స్ తమన్నా డార్లింగ్”.. ఒక్క పోస్ట్ తో బయటపడ్డ సెన్సేషనల్ మ్యాటర్..!

తమన్నా భాటియా .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . తమన్నా భాటియా ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా రాజ్య మేలేస్తుంది. తెలుగులోనూ పలు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది . కాగా రీసెంట్గా తమన్నాకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ విషెస్ అందించింది .

ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కాజల్ స్పెషల్ నోట్ రాసుకోచ్చింది . దీంతో అందరు తమన్నాకి విషెస్ అందించడం మొదలుపెట్టారు . కాజల్ పోస్టుపై తమన్నా కూడా రియాక్ట్ అయింది . “థాంక్యూ కాజు.. ఇన్ని సంవత్సరాల నుంచి నాకెంతో సపోర్టుగా నిలుస్తూ వచ్చావు.. నీ హద్దులు లేని ప్రేమకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా హ్యాపీగా ఉంది “అంటూ రిప్లై ఇచ్చింది .

ఈ పోస్ట్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇస్తుంది . అంతేకాదు తమన్నా ఇంకా చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగాలి అని.. ఫ్యాన్స్ కూడా ఆమెకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. కాగా హీరోయిన్ తమన్నా …బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది . ఈ విషయాన్ని స్వయాన ఆమె చెప్పుకు వచ్చింది . అయితే వీళ్ళు పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం ముఖం దాటేస్తున్నారు. అసలు చేసుకుంటారో..లేదో కూడా పెద్ద డౌటే..?