పరశురాముడిగా కనిపించనున్న ప్రభాస్.. ఇదే నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..?!

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పౌరాణిక పాత్రలు వేటిలో అయినా ఇట్టే సెట్ అయిపోతాడు ప్రభాస్‌. అయ‌న‌కు కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాత్ర మరి ఎవరిదో కాదు పరుశురాముడు.. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి ఉన్న దుర్మార్గులను సంహరించి భూభారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ దాల్చిన అవతారమే ఈ పరుశురాముడు. సప్త చిరంజీవులు పరశురాముని అవతారం కూడా ఒకటి. తండ్రి జమదగ్ని నుంచి అఖండ పరుశువు అంటే గండ్ర గొడ్డలిని సాధించి ఎంతో ఖ్యాతిని పొందాడు. క‌నక ఆయనను పరుశురాముడు అని పిలుస్తూ ఉంటారు.

Amid Prabhas-Kriti Sanon's Adipurush release, a look at all the Ramayans  told on screen | Bollywood News - The Indian Express

శ్రీమహావిష్ణువు సతావేశ్య‌ అవతారమైన ఆయ‌న 21సార్లు మొత్తం భూమండలాన్ని పర్యటించి వచ్చి.. ఆధ‌ర్మ‌ క్షత్రియులను హతమార్చాడు. వారి రక్తంతో తన పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కల్పించాడు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే కచ్చితంగా ఓ రేంజ్ లో సినిమా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ త‌మ‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ ప్రభాస్ నటించేది పరశురాముడి పాత్ర హీరోగా నడిచే సినిమాలో కాదట. ఇంతకీ ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ అపీరియన్స్ గా పరుశురాముడు కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం ప్ర‌భాస్‌ను సెలెక్ట్ చేశార‌ట‌.

Cinema Pranthan - Ranbir Kapoor and Sai Pallavi to start shooting for  Ramayana in early 2024 The Ramayana movie will kick off in early 2024,  starring RanbirKapoor and SaiPallavi. Yash will join

ఇక ఈ మూవీలో రాముడిగా ర‌ణ్‌బీర్‌, సీత గా సాయి పల్లవి, రావణుడి పాత్ర కోసం య‌ష్‌, హనుమంతుడు పాత్రకు సన్నిడియోల్‌, విభిష‌నుడిగా విజయ్ సేతుపతి, సూర్పణ‌కగా రకుల్ ప్రీత్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారీ తారాగణం అంతా నటిస్తున్న ఈ సినిమాలో పరశురాముడు పాత్రకు కూడా ఎంతో కీలకం గా ఉండ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. మేకర్స్ కాస్టింగ్ పై అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి. శ్రీరామనవమి సందర్భంగా డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే లక్ష్యంగా మేకర్స్ పనులు చేస్తున్నారట. అయితే ఇతిహాస గాధ‌ని రెండు భాగాలుగా తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.