వేషం మార్చేసుకుని దుబాయిలో తిరుగుతున్న తెలుగు హీరో.. కారణం ఇదే..

ఒకపటి టాలీవుడ్ హీరో శివాజీ దాదాపు 90కి వేగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శివాజీకి బ్యాడ్ నేమ్ రావడంతో.. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7లో అడుగు పెట్టి ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కంటెస్టెంట్లకు పెద్దన్నగా ఉంటూ అందరూ చూపును తనువైపు తిప్పుకున్నాడు. ఇటీవల #90’s కిడ్స్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్మంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేశాడు. ఎంటర్టైన్మెంట్ షోల‌లో కూడా హాజరయ్యారు. తాజాగా శివాజీ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసిన షోకు గెస్ట్ గా వచ్చాడు. ఇక కమీడియన్ ఆలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యవహరించే సోలో గెస్ట్ గా వచ్చిన సెలబ్రెటీస్‌ని పుట్టిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు జరిగే అన్ని సంఘటనల గురించి నిర్మొహమాటంగా షో లోనే అడిగేస్తూ ఉంటాడు.

ఈ ప్రోమోలో కూడా అలానే అడిగి షో పై మరింత హైప్‌ పెంచాడు అలీ. శివాజీని కూడా వదలలేదు. ఇదే విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ నుంచి హీరోగా మారడం తర్వాత రాజకీయాలు బిగ్‌బాస్, #90’s కిడ్స్ సిరీస్ ఇలా అన్ని అంశాలపై వరుస ప్రశ్నలు సందించాడు. సినిమాలకు దూరంగా ఉన్న టైంలో #90’s కిడ్స్ సిరీస్ ఆఫర్ ఎలా వచ్చింది.. అని ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ చాలా కాలం తర్వాత బాపునీడు గారిని కలవాలని వెళ్ళా.. ఆ టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. అదే విషయం చెప్పా అదేం పర్లేదు దాన్ని వదలకు అంటూ ఆయన వివరించారు. ఆ తర్వాత #90’s కిడ్స్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ కోసం దాదాపు రూ.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నువ్వు ఎవరో గుర్తుపట్టకుండా మీసాలు, గడ్డలు తీసేసి దుబాయిలో తిరిగావంట.. ఎందుకు అని అని ప్రశ్నించాడు. వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. అప్పటికప్పుడు కోర్టులో అంతా జరిగిపోయింది.. ప్రస్తుతం వ్యాపారం చేయాలంటే రాజకీయం కచ్చితంగా చేయాలంటూ వివరించాడు.

శివాజీ ఎందుకు దుబాయిలో పట్టుబడ్డాడు.. అన్న ప్రశ్న అలి అడగడానికి కారణం ఏంటంటే.. 2019లో అలంద మీడియా కేసులో శివాజీ పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఒక టీవీ ఛానల్ వాటాల వ్యాపారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.. ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం.. దీంతో శివాజీ ఎవరికంటా పడకుండా ఉండడానికి గడ్డం తీసేసి దుబాయ్ వెళుతున్న టైం లో పోలీసులు పట్టుకోవడం జరిగాయట. దీనిపై శివాజీ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాడు.. అని ఇప్పటివరకు 50 సార్లు అమెరికా వెళ్లాలని లీగల్ గా వెళ్ళినందుకు తనను ఎవరూ అడ్డుకోలేదని. ప్రస్తుతం న్యాయస్థానం చెప్పిన తనను అమెరికాకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్న శివాజీ.. అవన్నీ తప్పుడు కేసులు అని వివరించాడు. ఇవన్నీ శివాజీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు శివాజీ ఎలా స్పందించాడో తెలియాలంటే షో పూర్తిగా వచ్చేవరకు వేచిచూడాలి.