ఆ స్టార్ హీరో పై కన్నేసిన అనన్య నాగళ్ళ.. అయన అంటే చాలా ఇష్టం అంటూ..

స్టార్ బ్యూటీ అనన్య నగళ్ళ‌ మల్లేశం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ.. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నా అవకాశాలు మాత్రం ఊహించిన‌ రేంజ్‌లో రాలేదు. దీంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగి సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోయింది. నేను గ్లామర్ రోల్స్‌కు కూడా సిద్ధమే అంటూ డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్లకు హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రెండు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించినా హారర్‌ థ్రిల్లర్ మూవీ తంత్ర. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇందులో ధనుష్ రాఘ‌ముద్రి హీరోగా నటించాడు.

ఈ సినిమాకి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఈనెల 15న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలకు హాజరైన అనన్య.. తన సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అలాగే కొన్ని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పమని అడగగా.. నాకు కాబోయే వాడు నిజాయితీగా ఉంటే సరిపోతుంది. అలాంటి వాడైతే ఓకే. సరైన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నా. ఇండస్ట్రీ వాళ్ళు అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా బయట వారైతే బెటర్ అని భావిస్తున్న అంటూ వివరించింది.

ఇక అనన్య మాట్లాడుతూ టాలీవుడ్ యంగ్ హీరో అంటే నాకు క్రష్ అని.. ఓపెన్ అయింది. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. నా టాలీవుడ్ ఫేవరెట్ నాగ శౌర్యా అన్ని. ఆయ‌న అంటే నాకు చాలా ఇష్టం అంటూ వివ‌రించింది. అతనితో సినిమా ఆకాశం వస్తే కచ్చితంగా నటించి తీరుతుంద‌ట‌. నా చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. వాళ్ళ సినిమాలు చూస్తూనే పెరిగానని వివరించింది. ఇంతవరకు ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదని వివరించిన ఆమె.. కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఇండస్ట్రీ వాళ్ళు అంటే కచ్చితంగా కమిటై ఉంటారని అంత భావిస్తారు. కానీ నేను మాత్రం కమిటెడ్ కాదు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు నేను ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కోలేదు అంటూ వివరించింది. కాగా టాలీవుడ్ క్రష్ నాగశౌర్య అని చెప్పడంతో అతిగా ఆశపడకుండా చిన్న హీరో నైనా మంచి హీరోని క్రష్ గా సెలెక్ట్ చేసుకున్నావ్ అన్నీ.. ఖ‌చ్చితంగా నీకు నాగశౌర్యతో నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.