జనసేనలోకి మాస్ కా దాస్ విశ్వ‌క్ ఎంట్రీ.. క్లారిటీ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి చిన్న హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్ సేన్. పలు వివాదాల్లో చిక్కుకుంటూ కాంట్రవర్షల్ హీరోగా కూడా పాపులర్ అయిన ఈయన.. దాదాపు 5 సంవత్సరాలు పాటు సినిమాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు ఒక మంచి కథతో త్రో బ్యాక్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్కా దాస్ విశ్వక్.. గామి సినిమాతో శివరాత్రి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు భారీ హైప్‌తో రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం మూవీ టీం మొత్తం ఎంతో కష్టపడ్డారు. దీనిలో ఉన్న కష్టం ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచడానికి పెరిగాయి.

ఇక ఈ సినిమాతో ఖ‌చ్చితంగా సక్సెస్ అందుకుంటామని మేకర్స్ కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా గామి సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకలు వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరై సందడి చేశారు. ఈ నేపద్యంలో విశ్వక్ సేన్‌కు ఇంటర్వ్యూ నుంచి మీ నాన్న గారు ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో అనుకూలంగా సపోర్ట్ గా నిలిచారు. ఇక ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీలో మీరు ఏదైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించారు. దీనిపై విశ్వక్‌ నుంచి స్ట్రాంగ్ ఆన్సర్ వినిపించింది.

సినిమా వేడుక‌లో జనసేన పార్టీకి అనుకూలంగానూ లేదా వ్యతిరేకంగానూ మాట్లాడితే కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. అందుకే విశ్వక్ సేన్‌ ఈ విషయాన్ని గమనించి చాలా తెలివిగా తను డ్రోనాల్డ్‌ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్.. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరిగే టైంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తా అంటూ వివరించాడు. చాలా సెన్సిటివ్ ప్రశ్నలకు బ్రెయిన్ యూస్ చేసి స్ట్రైన్ అవ్వకుండా సమాధానం చెప్పాడు విశ్వక్. ఎటువంటి వివాదం లేకుండా డ్రోనాల్డ్ ట్రంప్ ఫ్యాన్ ని అని ఇక్కడ రాజకీయాలతో నాకు సంబంధం లేదంటూ సమాధానం చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం విశ్వక్ నటించిన గామి ప్రేక్షకుల్లో రిలీజ్ అయి మొదటి షోలో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ముందు ముందు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.