ఆ పార్ట్ పై ఉన్న టాటూ చూపిస్తూ రెచ్చిపోయిన మంచి లక్ష్మి.. టాటూ మీనింగ్ ఏంటంటే..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మంచు లక్ష్మి. లేటు వయసులోను ఘాటు అందాలు ఆరబోస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. అమ్మడుకి ఐదు ప‌దులవ‌య‌స్సు మీద పడుతున్నా.. ఇప్పటికీ తగ్గని అందంతో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ కుర్రాళ‌కు కునుకు క‌రువుచేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి గ్లామ‌ర్ ఫోటోషూట్ ఒకటి నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. వీపుపై ఉన్న సీక్రెట్ టాటూను హైలైట్ అయ్యేలా చేస్తూ ఆమె హాట్ ఫోజులు ఇచ్చింది. ఇంతకీ ఈ టాటూ ఏమిటి అనేది పరిశీలిస్తే.. వీపు మీద వాట్ యూ సీ ఈజ్ సీయింగ్‌యూ అని రాయించుకుంది. అయితే దీనిలో తన క్యారెక్టర్ ను ప్రతిబింబించేలా చూపించింది మంచు డాక్టర్. త‌న‌ ఆత్మవిశ్వాసం, ధైర్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ ను ప్రతిబింబించే ఈ టాటూ అర్థం ఉంది. ఎవ‌రేమ‌నుకున్నా నాకు అనవసరం.. నేను నాకు నచ్చినట్లే ఉంటా.. జీవిస్తా.. అని ఆ టాటుతో చెప్పకనే మంచి డాటర్ చెప్పేసింది.

తరచుగా ట్రోల్స్ కు గురవుతూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఆమె మాట తీరు, ప్రవర్తనతో సోషల్ మీడియాలో జనాల ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది. తనపై వచ్చే విమర్శలు కొట్టి పారేస్తూ అవన్నీ పని లేని వాళ్ళు చేస్తే చెత్త కామెంట్స్ అని నెగటివ్ కామెంట్స్‌ పట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్లలేమ‌ని ఆమె భావిస్తూ ఉంటుంది. లేటెస్ట్ పోస్ట్ పై కూడా నేటిజన్స్ నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం మానేసింది మంచు లక్ష్మి. మొదట కెరీర్ ను అమెరికాలో ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హోస్ట్ గా పలు షో లలో వ్యవహరించింది. రెండు, మూడు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించిన ఈమె సడన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనగనగా ఓ ధీరుడు సినిమాతో లేడీ విలన్ గా పరిచయమైంది. గుండెల్లో గోదారి, లక్ష్మీబాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ సినిమాల ద్వారా మంచు లక్ష్మి హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే ఈమెకు ఊహించిన రేంజ్ లో సక్సెస్ లు రాకపోవడంతో.. అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి. అటు నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించింది. ఇక్కడ కూడా లక్ష్మికి కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌పై పాగా వేసింది. ముంబైలో లగ్జరీ హౌస్ తీసుకొని అక్కడే నివసిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో రాణించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ప్రస్తుత లక్ష్యం బాలీవుడ్ లో రాణించడమే నట. ఇక టాలీవుడ్ లో సక్సెస్ సాధించలేకపోయిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ పరిశ్రమలో ఆయినా సక్సెస్ అవుతుందో.. లేదో.. వేచి చూడాలి. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్ కావడం విశేషం. ఆమెతో పాటు బాలీవుడ్ ప్రైవేట్ పార్టీలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తూ అవకాశాల కోసం మరో పక్కన ప్రయత్నాలు చేస్తుంది మంచు లక్ష్మి. ఇటీవలే రకుల్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.