బార్బీ డాల్ ల మెరిసిన సమంత.. కిల్లర్ లుక్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న స్టార్ బ్యూటీ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు చెకేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ భారత్ కు తిరిగి వచ్చిన శ్యామ్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల t20 పేరుతో హెల్త్ ఫొడ్‌కాస్ట్ స్టార్ట్ చేసిన ఈమె ఇందులో తను మయోసైటిస్ కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి కోలుకున్న విధానం గురించి క్లియర్గా చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

ఇప్పటికే ఆ వీడియోస్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరో పక్క నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్యామ్.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే పనిలో బిజీ అయింది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా తన ఇన్స్టాలో షేర్ చేసిన శ్యామ్ లేటెస్ట్ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ లో భాగంగా ఫెమీనా మ్యాగజైన్ శ్యామ్‌ ఫోటోను కవర్ పేజీ పై పబ్లిష్ చేసింది. ఈ విషయం తన ఇన్స్టా వేదికగా శ్యామ్ షేర్ చేసుకుంటూ.. సమంత ఓ ప్రకృతి శక్తి. ఏం మాయ చేసావే లోని జెస్సి పాత్ర నుంచి సిటాడల్ సిరీస్ లో ఆమె పోషించిన పాత్ర వరకు సమంత జర్నీ దేశంలో మహిళలకు స్ఫూర్తినిస్తుంది అంటూ సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసింది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట‌ వైరల్ అవ్వడంతో.. ఆమె లుక్స్ చూసీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఎంతో ముద్దుగా క్యూట్ గా కనిపించిన శ్యామ్.. ఇప్పుడు మరీ ఇంత సన్నగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ ట్రీట్ తో రోజురోజుకు రెచ్చిపోతున్న శ్యామ్. ఈ ఫొటోస్ లో బార్బీ డాల్ లా మెరిసింది. కిల్లర్ చూపులతో సమంత కవిస్తున్న ఈ పిక్స్ నెట్టింట‌ తెగ వైరల్ గా మారాయి. వీటిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)