కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించబోతున్న తమన్నా.. కుర్రాళ్లు తట్టుకోగలరా..!

తమన్నా .. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ . అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 19 ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . వామ్మో.. ఒకటా రెండా ఆమె ఖాతాలో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బోల్డ్ బ్యూటీగా మారిపోయింది . టాప్ లేకుండా హాట్ రొమాన్స్ చేయడం చెడ్డీ అందాలతో కుర్రాలను రెచ్చగొట్టడం తమన్న స్పెషాలిటీ .

అయితే అలాంటి తమన్న ఇప్పుడు అఘోరా పాత్రలో కనిపించబోతూ ఉండడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది. తాజాగా ఆమె ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఓదల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ కి ఆమె సైన్ చేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు . 2022లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . క్రైమ్ ధ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్టర్ ఓటిలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అందుకునింది .

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుందట . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . నేడు శివరాత్రి సందర్భంగా మూవీలోని తమన్నా లుక్ ను షేర్ చేశారు మేకర్స్ . కాషాయ దుస్తుల్లో ..తమన్న ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు. చేతిలో డమరుకం ..నుదుటిన విభూది .. మరో చేతుల్లో కర్రతో ఇప్పటివరకు మనం తమన్నాను చూడని డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. శివశక్తి రూపంలో తమన్నా దర్శనమివ్వడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది..!!