ఆ హీరో తో లిప్‌లాక్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

కళ్యాణం కమనీయం సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవాని శంకర్. మొదటి సినిమాతోనే తన అందంతో యువతను ఆకట్టుకున్న ఈ కన్నడ చిన్నది తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సిరీస్ లోను ప్రేక్షకులను మెప్పించింది. త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా గోపీచంద్ భీమా మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులు పలకరించనుంది. గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమాలో హీరోయిన్గా ప్రియ భవాని నటించింది. ఇక శివరాత్రి కానుకగా ఈరోజు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. భీమాకు సినిమాకి కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఉన్నాయి. ఇక నేడు సినిమా రిలీజ్ కావడంతో నిన్న మొన్నటి వరకు ప్రమోషన్స్ లో సందడి చేశారు మూవీ మేకర్స్.

అలాగే పలు ఇంటర్వ్యూలో ప్రియ భవాని శంకర్ కూడా పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అలాగే తన పర్సనల్ విషయాలను కూడా ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులతో పంచుకుంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియ మాట్లాడుతూ ఓ ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆమెకు ఎదురైన ఆ ప్రశ్న ఏంటి.. ఏం సమాధానం చెప్పిందో.. తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఏ నటుడితో అయినా లిప్ లాక్ చేయాలనుకుంటున్నారా అని ఇంటర్వ్యూవ‌ర్‌ ప్రశ్నించగా ఆమె నిర్మొహమాటంగా సూటి సమాధానం చెప్పింది. నాకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టం. నేను అల్లు అర్జున్ అభిమానిని అని తెలిపిన ప్రియా భవాని శంకర్.. రొమాంటిక్ సీన్స్ లో నటించాలంటే.. అల్లు అర్జున్తో లిప్ లాక్ చేయడానికి నేను ఓకే అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దూత వెబ్ సిరీస్ లోను మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ప్రస్తుతం రత్నం, ఇండియన్ 2 సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా వరుస సినిమాల ఆఫర్లను అందుకుంటు బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ టీవీ ప్రెసెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత మోడల్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది. బుల్లితెరపై త‌న నటనతో మెప్పించి సినిమా అవకాశాలను కొట్టేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో లిప్‌లాక్ సీన్ ఉంటే కచ్చితంగా నేను చేయడానికి రెడీ అంటూ ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారడంతో.. పిల్ల మంచి రొమాంటిక్, చాలా డేరింగ్ గర్ల్ , ఎంత సూటిగా బన్నీ తో లిప్ లాక్ చేయాలని ఉందని.. తెలివిగా మనసులో కోరికను బయటపెట్టేసిందే అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.