ఆ విషయంలో శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్.. ఇక లైఫ్ సెట్టిల్ అయిపోయినట్టే..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌గా కొన‌సాగుతున్న‌చాలామంది నటీనటులు దీపం ఉన్నప్పుడే ఇల్లు అల్లుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ.. మంచిగా ఆఫర్లు వ‌స్తున్న టైంలోనే వేరే ఏదైనా వ్యాపార రంగం, ఇంకేదైనా చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ రాణించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డబ్బును సంపాదించడమే కాదు వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ విషయంలో మృణాల్ ఠాగూర్ అందరికంటే రెండింతలు తెలివిగా ఆలోచ‌న‌లు చేస్తుంది. తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ముంబైలో బిజినెస్ మొదలు పెట్టింది.

మరి ఆమె ఏం బిజినెస్ చేస్తుంది.. ఇంతకీ శోభన్ బాబును ఆమె ఫాలో అవుతున్న ఆ విషయం ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. మొద‌టి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువైన ఈ ముద్దుగుమ్మ వరస ఆఫర్లను అందుకుంటు తన న‌టన‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాకు రెట్టింపు చేసుకుంటున్న ఈ లక్కీ హీరోయిన్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అవకాశాలతో పాటు పెరిగిన ఆదాయాన్ని కూడా రెట్టింపు చేయడానికి రియ‌ల్ ఎస్టేట్ వైపు కాన్స‌న్ట్రేట్ చేసింది. అంతేకాదు ముంబైలో ఇప్ప‌టికే రెండు అపార్ట్మెంట్స్ కూడా కొనుగోలు చేసేసింది.

ఈ రెండు ప్రాపర్టీస్ కంగనా రనౌత్ బంధువుల‌ ఆస్తులట‌. అందరిలో దాదాపు రూ.11 కోట్ల ఖరీదైన ఓ ఫ్లాట్‌ని కొనేసినట్లు సమాచారం. ముంబైలోనే కాకుండా హైదరాబాద్‌లోను ఇల్లు కొనే ప్రయత్నంలో ఉందంట ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్ లోనే మృణాల్‌కు ఎక్కువ‌ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలే కాక మరో రెండు తమిళ సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ బ్యూటీ. మొత్తానికి వచ్చిన డబ్బులు భూమిపై ఇన్వెస్ట్ చేస్తుంది. అలా ఇప్పటివరకు భూములపై ఇన్వెస్ట్ చేస్తూ కోట్లు సంపాదించిన ఏకైక టాలీవుడ్ హీరో శోభన్ బాబు. ఆయననే ఇప్పుడు మృణాల్ కూడా ఫాలో అవుతుంద‌ట‌.