“అస్సలు వాళ్ళకి నా పేరు కూడా తెలియదు”..కన్నీళ్లు పెట్టిస్తున్న గోపీచంద్ మాటలు..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హెల్ప్ చేసిన సరే ఆ విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు . రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ ఇదే విధంగా చేస్తూ ఉంటారు . ఆ లిస్ట్ లోఖి వస్తాడు హీరో గోపీచంద్ . గోపీచంద్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ గోపీచంద్ వెల్ సెటిల్.. ఆయనకు పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి .

గోపీచంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భీమా. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోని చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు గోపీచంద్ . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సంచలన విషయాన్ని బయట పెట్టాడు . “ఇష్టంతో చేస్తే ఆ పని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది ..? నా శక్తి మీద నేను కొందరు చదివించాను.. అసలు వాళ్లలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు”..

” కానీ వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. నాకు అది చాలా చాలా హ్యాపీ చదువుకునే ఆసక్తి ఉన్నప్పుడు దేనికి డబ్బు అడ్డం కాకూడదు ..అనేది నా ఒపీనియన్ నాకు ఎంత సహాయం చేయగలిగితే అంత చేస్తాను ” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించాడు గోపీచంద్. దీంతో గోపీచంద్ పేరు మారుమ్రోగిపోతుంది. కోత్ల రెమ్యూనరేషన్స్ తీసుకునే హీరోలు కూడా రూపాయి సహాయం చేయకుండా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని .. నువ్వు నిజంగా గ్రేట్ అని ఎమోషనల్ గా ఫీల్ అయిపోతున్నారు..!