వేసవిలో ఏసి బిల్ ఆదా చేసే ఐదు సూపర్ టిప్స్ ఇవే..!

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఏసీ పై ఆధారపడతారు. ఏసీ లేనిదే పూట గడవదంటూ నిత్యం ఏసీ కిందే కూర్చుంటారు. బయట ఉన్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ఎంత లేనివారు అయినప్పటికీ ఏసీ పెట్టించుకుంటారు. ఇక ఈ క్రమంలోనే కరెంట్ బిల్ కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. అయితే కరెంట్ బిల్ ని కంట్రోల్ చేసే కొన్ని టిప్స్ ను తెలుసుకోవడం ద్వారా మేలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాత్రి సమయంలో మీ ఏసీలో స్లీప్ మోడ్ ను ఉపయోగించండి. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. తద్వారా కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది.

2. మీ ఏసీ తో పాటుగా సీలింగ్ ఫ్యాన్ లను కూడా ఆన్ చేయడం వల్ల చల్లటి గాలి గది మొత్తం వ్యాపిస్తుంది. ఈ విధంగా కూడా పవర్ సేవ్ చేయవచ్చు.

3. కరెంట్ వినియోగాన్ని తగ్గించడానికి మీ ఫిల్టర్ లను మాత్రం తప్పకుండా శుభ్రం చేయండి. లేదా రీప్లేస్ చేయండి.

4. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో మీ కర్టెన్ను లేదా బ్లెండ్‌లను ను మూసి వేయండి. ఇది ఏసీ పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి సహాయపడుతుంది.

5. రోజులో చల్లగా ఉండే సమయంలో ఎయిర్ కండిషనర్ వాడకుండా కిటికీలు, తలుపులు తెరవండి.
పైన చెప్పిన సూచనలను పాటించి మీరు కనుక వేసవికాలంలో ఏసీ ని వాడితే మీకు తప్పనిసరిగా కరెంట్ లో మార్పు కనిపిస్తుంది.