రంగస్థలంలో జగపతిబాబు రోల్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ ఫెలో.. ఎవరో తెలుసా..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. భారీ కలెక్షన్లు వసూళ్ళు చేసి నాన్ బ‌హుబ‌లి రికార్డ్‌లు క్రియేట్ చేసిన ఈ మూవీ మేక‌ర్స్‌కు లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమాను మొదట్లో సుకుమార్ మీడియం బడ్జెట్లో సింపుల్ విలేజ్ డ్రామాగా తెర‌కెక్కించాలని ప్లాన్ చేశాడట. అయితే ఈ సినిమా పూర్తయ్య సమయానికి అది భారీ బడ్జెట్ సినిమాగా మారిపోయింది. ఇక లో బడ్జెట్ సినిమాగా ప్లాన్ చేసినప్పుడు బడ్జెట్ కు తగ్గట్లుగా యాక్టర్స్ ను సెలెక్ట్ చేయాలని ఆడిషన్స్ కూడా చేశారట మేకర్స్. అప్పుడు జగపతిబాబు పేరు ఆలోచనలో కూడా లేదట. అయితే ఆ విషయాన్ని ప‌లు క్యారెక్టర్ రోల్స్ తో పాపులర్ అవుతున్న న‌టుడు అప్పాజీ అంబరీష్ వివరించాడు. అప్పాజీ ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు సినిమాల్లో తండ్రిగా, డాక్టర్‌గా, లాయర్గా చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన ఆయన రంగస్థలంలో గోల్డెన్ చాన్స్ సంపాదించాడట. విలేజ్ ప్రెసిడెంట్ పాత్ర కోసం ఆయన ఆడిషన్స్ కి హాజరయ్యాన‌ని.. మూవీ యూనిట్ ఆయన్ను సెలెక్ట్ కూడా చేశారని.. కానీ ఇంకా పెద్ద నటుల‌ను తీసుకోవాలని ఆలోచన మొదలైనప్పుడు జగపతిబాబు లైన్లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. మిమ్మల్ని ఈ సినిమా నుంచి తీసివేయడం లేదు.. జగపతిబాబుకి అసిస్టెంట్స్ ఉంటారు.. అందులో ఒక క్యారెక్టర్ ఇస్తాం అని చెప్పార‌ని సరే అదైనా దక్కుతుందని భావించి కామ్ అయిపోయాన‌ని.. ఇక షూటింగ్ మొదలైన తర్వాత ప్రొడక్షన్ టీంకు కాల్ చేస్తే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదని.. ఆయన వివరించాడు. రంగస్థలం సినిమా ముందు అనుకున్న బడ్జెట్లో తెరకెక్కించి ఉంటే నేనే విలన్ రోల్ లో కనిపించే వాడినని చెప్పుకొచ్చాడు.

నాకు 30 సినిమాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇప్పటికి ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళా. కొందరైతే మరి సిల్లీ సన్నివేశాల్లో నటించి చూపించమని అడుగుతారు.. కూరగాయలు కొంటున్నట్లు నటించమంటారు.. ఒక సీనియర్ నటుడిని ఆడిషన్స్ చేసే విధానం కూడా ఇలా ఉంటుందా అంటూ మండిపడ్డారు. తను కొన్ని సినిమాల్లో డాక్టర్, ఫాదర్ పాత్ర‌ల్లో కూడా నటించాన‌ని.. చాలామంది అవే పాత్రల్లో నన్ను ఇప్పటికీ పిలుస్తుండడంతో చిరాకు వస్తుందంటూ మాట్లాడాడు. అయితే అంబ్రెష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. నువ్వు చేసిన పాత్రలతో నిన్ను పిలిస్తే నీకు చిరాకు వస్తుందా.. అలాంటప్పుడు ఆ పాత్రలో నటించకుండా ఉండాల్సింది. ప్రేక్షకులకు ఏది కనెక్ట్ అయితే అదే విధంగా కొంతకాలం పిలుస్తూ ఉంటారు. అది ఏ స్టార్ హీరో కైనా కామ‌న్‌.. వాళ్లే దానిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది నువ్వు నటించిన పాత్రలో నిన్ను పిలిస్తే చిరాకు పడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.