“అబ్బే..అంత దమ్ము మన తెలుగు డైరెక్టర్ కి లేదుగా”.. టంగ్ స్లిప్ అయిన గోపీచంద్..!

గోపీచంద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది . రీసెంట్గా ఆయన నటించిన భీమా సినిమా అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూస్తున్నాం. చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నాడు గోపీచంద్ . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో గోపీచంద్ పర్ఫామెన్స్ బాగా హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు గోపీచంద్ .

ఇలాంటి క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేశారు . ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పలువురు గోపీచంద్ ని మెచ్చేసుకుంటూ ఉంటే .. మరికొందరు అంత నోటి దూల అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . గోపీచంద్ ని జర్నలిస్టు ప్రశ్నిస్తూ ..”ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ తో ప్రజా సమస్యలను చర్చించే సినిమాలు వచ్చేవి ..అలాంటివి ఇప్పుడు రావడం లేదు “అంటూ ప్రశ్నించారు .

దీనికి గోపీచంద్ కూడా చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. కాన్సెప్ట్లు బాగున్న వాటిని తెరపై చూపించగలగాలి .. లేని పక్షంలో వాటిని టచ్ చేయకపోవడం మా నాన్న కృష్ణ ఉన్న సమయంలో రచయితలు ప్రజల్లో తిరుగుతూ.. వాళ్ల సమస్యలను బాగా తెలుసుకొని అలా పాత్రను సృష్టించే వాళ్ళు .. అయితే డైరెక్టర్లు ఇప్పుడు జనాలను చదవడం లేదు అని .. సమాజంలో తిరిగితే అనేక సమస్యలు తెలుస్తాయి అని .. అప్పుడు ఇంకా మంచి సినిమాలను తెరకెక్కించొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు “.

సామాజిక సమస్యలతో రెండు గంటల సినిమా తీస్తే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నట్లు కూడా తెలిపారు. దీంతో గోపీచంద్ మాటలు వైరల్ గా మారాయి . అంతేకాదు గోపీచంద్ టంగ్ స్లిప్ అయ్యాడు అని ఇప్పుడిప్పుడే హిట్ పడుతున్న మూమెంట్లో ఇలా మాట్లాడడం డైరెక్టర్లకు మండిస్తూ వస్తుంది అని పరోక్షకంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!