అప్పుడు ఎన్టీఆర్ .. ఇప్పుడు అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ ఫేస్ చేసినటువంటి సిచువేషన్ ఎదుర్కోబోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తొక్కేయడం అనేది సర్వసాధారణం . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ..పాన్ ఇండియా హీరోలను కూడా బాగా తొక్కేస్తున్నారు . కొంతమంది పెద్ద వ్యక్తులు. రీసెంట్గా అల్లు అర్జున్ కూడా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .4

రీసెంట్గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాను కొన్ని దుష్ట శక్తులు పోస్ట్ పోన్ చేయించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ అయ్యేలా పోస్ట్ పోన్ చేయించారు . ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై ఎంత ఫైర్ అయ్యారో కూడా మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే సిచువేషన్ ఫేస్ చేయబోతున్నాడట. పుష్ప2 సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దానికి కారణం పుష్ప సినిమాకి కాంపిటీషన్ గా మరికొన్ని బడా సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండడమే అంటూ తెలుస్తుంది. పుష్ప సినిమాతో పోటీపడేందుకు విజయ్ దళపతి రెడీగా ఉన్నాడు. విజయ్ అండ్ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వెరీ వెరీ క్రేజీ ప్రాజెక్ట్ గోట్ . అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు రజనీకాంత్ “వెట్టై”.. కమలహాసన్ “ఇండియన్ 2”.. కూడా అదే డేట్స్ లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

అంతేకాదు నార్త్ నుంచి సింగం కూడా పుష్పపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం 3 ఆగస్టు 15 రిలీజ్ చేయడానికి మేకర్ ఫిక్స్ చేశారట . దీంతో ఈ తలనొప్పులు భరించలేని సుకుమార్ సినిమాని పోస్ట్ పోన్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!