టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళికి సినిమాలంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలోను ఆయన కష్టం. సినిమాపై ఆయనకు ఉన్న డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తాయి. అలా రాజమౌళి తాను దర్శకత్వం వహించిన సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకున్నాడు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఇక శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా సరే టాక్ బాగుందని తెలిస్తే చాలు అది ఎంత చిన్న సినిమా అయినా థియేటర్లకు చెక్కేస్తూ ఉంటాడు జక్కన్న. చాలా వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే సినిమాలు చూడడానికి ఇష్టపడతారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మలయాళం నుంచి వచ్చిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ ప్రేమలు. గిరీష్ ఏడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను మాలీవుడ్ లో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ ఈరోజు శివరాత్రి కానుకగా తెలుగు వర్షన్ లో రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాకు టాక్ పాజిటివ్ గా రావడంతో.. మరోవైపు కొడుకు రిలీజ్ చేసిన సినిమా కావడంతో మూవీ పై మరింత బజ్ ఏర్పరచడానికి రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడట.
ఈ సినిమా చూడడానికి రాజమౌళి థియేటర్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. హైద్‌రాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే రాజమౌళి ఈరోజు ఉదయం 11:45 నిమిషాలకు ఈ సినిమాను చూడడానికి సిద్ధమయ్యాడట. రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ స్క్రీనింగ్లో పాల్గొన్నారని సమాచారం. కోలీవుడ్ స్టార్ యాక్టర్ పాహద్ పజిల్ ప్రొడ్యుసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాను గిరీష్.ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ కీలక పాత్రల్లో మెప్పించారు.