ఆ పని చేయడం వల్లే “భీమా” సినిమా హిట్ అయ్యిందా..? గోపీచంద్ పై ఇంత చెత్త రూమరా..?

పాపం .. గోపిచంద్ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేక ఎంత అల్లాడిపోయారో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆయన ఎంతో ఎంతో కష్టంగా ఉన్న పాత్రను కూడా చాలా ఇష్టంగా భరించి చేశాడు . అలాంటి సినిమాలు కూడా ఆయనకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చిపెట్టాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ గోపీచంద్ నటించిన భీమా సినిమా రివ్యూ వైరల్ గా మారింది. గోపీచంద్ తాజాగా నటించిన భీమా సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది .

చాలాకాలం తర్వాత గోపీచంద్ లోని రియల్ నటుడిని బయటపెట్టింది ఈ సినిమా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. ఈ మహాశివరాత్రికి గోపీచంద్ అభిమానులకి ఇది నిజంగా ఒక శివతాండవం లాంటి సినిమానే అంటూ చెప్పుకొస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇదివరకు కూడా గోపీచంద్ కనిపించాడు కానీ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా ఉంది . ఎక్కడ ఓవర్ లేకుండా నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ పర్ఫామెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది .

అంతేకాదు పక్కా కమర్షియల్ – రామబాణం సినిమాలు గోపీచంద్ కు ఎలా నిరాశ పరిచాయో .. ఈ సినిమా కూడా అలాగే నిరాశపరచబోతుంది అంటూ కొందరు ట్రోల్ చేశారు . అయితే గోపీచంద్ మాత్రం సైలెంట్ గా అలాంటి ట్రోలింగ్ ని భరించారు . ఈ సినిమాలో గోపీచంద్ పర్ఫామెన్స్ కెవ్వు కేకలా ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అంటూ భీమా ప్రీమియర్స్ కి రివ్యూలు ఇస్తున్నారు .

అయితే గోపీచంద్ ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తున్నారు. పలు ఇంటర్వ్యూలలో కూడా గోపీచంద్ కు ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయని. పరోక్షకంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ కారణం అంటున్నారు . అయితే గోపీచంద్ ఫ్యాన్స్ మాత్రం గోపీచంద్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని ..ఆ కారణంగానే ఈ సినిమా హిట్ అయింది అని.. దయచేసి ట్రోల్స్ ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే భీమా ఏ విధమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?