“పిల్లలు వద్దు అనుకుంటే ఇలానే చేయండి.. మేము అదే చేశాం”..ఉపాసన షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

ఉపాసన ..మెగా ఇంటి కోడలు .. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటుంది . జనాలకు పనికొచ్చే విషయాలను ఓపెన్ గా చెప్పేస్తుంది . కొంచెం కూడా ఇబ్బంది పడకుండా జనాలకు ఉపయోగపడే విషయాలను చెప్పడంలో ఉపాసన తర్వాతే మరి ఎవరైనా. మనందరికీ తెలిసిందే ఉపాసన పెళ్లి తర్వాత 11 ఏళ్లకు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది . ఈ విషయంలో నిజంగా ఉపాసన గ్రేట్ అని చెప్పాలి, చాలామంది ఆమెను ట్రోల్ చేసిన ఆమె ఓపిగ్గా సహనంగా తట్టుకునింది .

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి సంచలన కామెంట్స్ చేసింది . ఎవరైనా సరే మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా “మెటర్నిటీ లీవ్స్ ..తీసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది “అంటూ చెప్పకు వచ్చింది. దీనికి సంబంధించి పలు కంపెనీలతో కూడా మాట్లాడమంటూ చెప్పుకొచ్చింది . అంతేకాకుండా ఆడవాళ్లు వారి ఎగ్స్ ని కాపాడుకోవాలి అని .. అప్పుడే వాళ్ళు.. ఎప్పుడు పిల్లల్ని కనాలి అనుకుంటున్నారో.. అప్పుడు కనొచ్చు అని .. లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనాలి అని అందరూ అనుకుంటారని ..

దానికోసం మనం ముందుగానే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి అని .. ఆర్థిక పరిస్థితి బాగుండి.. పిల్లల్ని కనాలి అనుకున్న సమయంలో ఆ ఎగ్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఇది మహిళలతో పాటు దేశ పురోగతికి సైతం ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చింది . “నేను కూడా నా ఎగ్స్ అలాగే దాచుకున్నాను “అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ప్రజెంట్ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగా కోడలు ఇంత బోల్డా అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!