సూర్య s/o కృష్ణన్.. ఆయన రియల్ స్టోరీ.. సీక్రెట్ రివీల్ చేసిన గౌతమ్ మీనన్..?!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సూర్య s/o కృష్ణన్ సినిమా ఒకప్పటి క్లాసికల్ హిట్ మూవీ గా ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ చార్జ్ బ‌స్టర్‌లలో ఒక‌టిగా నిలవడం విశేషం. హరీష్ జయరాజ్ అద్భుత స్వరాలు అందించిన ఈ సినిమా ప్రేక్షకుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తమిళ్ వెర్షన్ బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలవడంతో.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి అలాగే కథ రాసుకోవడానికి గల ప్రేరణ గురించి ఇప్పటివరకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను తాజాగా డైరెక్టర్ గౌతమ్ మేనన్ వివరించాడు.

ఆయన మాట్లాడుతూ ఈ స్టోరీలో చాలా వరకు తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ప్రయాణాన్ని రివీల్ చేశానని.. నిజజీవితంలో తాను ఎంతగానో ప్రేమించి అభిమానించే తన తండ్రి మరణం గురించి తెలుసుకున్న తర్వాత.. ఫీలైన ఎమోషన్‌ని తెరపై చూపించాన‌ని వివరించాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్‌ మూవీ. సూర్య తన గత జీవితాన్ని తన తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడంతో స్టోరీ మొత్తం రన్ అవుతుంది. ఇక 2002లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన జీవితం ఎలా సాగిందో అనే దాన్ని ప్రేరణగా తీసుకొని.. గౌతమ్ మీన‌న్‌ కథను రాసుకున్నాడట. ఇక ఆయ‌న తండ్రికి ఈ సినిమాను నివాళిగా ఇచ్చారు. ఈ సినిమా తమిళనాడులో భారీ సక్సెస్ సాధించింది. తెలుగులో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

అయితే ఈ సినిమా మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడ‌మే కాదు హీరో సూర్యకి కూడా మరింత మార్కెట్ ను తెచ్చి పెట్టింది. ఈరోజుకు కూడా చాలామంది ఈ సినిమాను బుల్లితెరపై వస్తే చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక సినిమా కాస్టింగ్ ఎంపిక గురించి గౌతమ్ మాట్లాడుతూ టాప్ సీక్రెట్ ను రివిల్ చేశాడు. సినిమా కీలక పాత్రల‌కు మోహన్‌లాల్, దీపికా పదుకొనే, నానా పటేకర్లు మొదటి ఎంపిక అని.. చెప్పుకొచ్చిన గౌత‌మ్‌.. సినిమాలో సూర్య తండ్రి కృష్ణున్‌ పాత్ర కోసం మోహన్‌లాల్ అనుకున్నానని.. లేదా నాన్న పటేక‌ర్‌ను తీసుకోవాలని భావించానని వివరించాడు. అయితే మూవీలో ఒకే నటుడు ద్విహాత్రాభినయం చేయాలన్న భావన మొదట్లో నచ్చకపోయినా.. సూర్య అతడిని కన్విన్స్ చేయ‌డంతో ఒప్పుకున్నాన‌ని వివ‌రించాడు.

ఇక సూర్యనే తండ్రి కొడుకుగా దీపత్రాభినయంలో నటించి మెప్పించాడు.. అలాగే మేఘనగా నటించేందుకు దీపికను అనుకున్నాన‌ని వివ‌రించాడు. ఓం శాంతి ఓం కి కమిట్మెంట్,, డేట్స్ క్లాష్ కావడంతో ఈ ప్రాజెక్టు నుండి దీపిక తప్పుకుందట. ఆ తర్వాత సమీరా రెడ్డి ఈ పాత్రను నటించారు. ఇలా మొదట అనుకున్న కాస్టింగ్ మొత్తం తారుమారైనా.. చివ‌ర‌కు ప్రతి నటుడు తన పాత్రలో నటించి మెప్పించారు. సూర్య తండ్రి పాత్రకు తల్లిగా సిమ్రాన్ నటించగా.. దివ్య స్పందన పాత్ర మలుపు తిప్పడం అద్భుతంగా సరిపోయాయని గౌతమ్ వివరించాడు. ఇక ఈ సినిమా తమిళ్‌లో వారణం ఐరన్ పేరుతో 2008లో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ ఈ సినిమా తన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించార‌ని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.