ఇప్పటి వరకు ఏ హీరో చేయలేని పని చేసిన అల్లు అర్జున్.. దట్ ఈజ్ ఐకాన్ స్టార్ పవర్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా .. కొందరు మాత్రం రికార్డ్స్ సృష్టించడానికి .. వారు సృష్టించిన రికార్డ్స్ వాళ్లే బ్రేక్ చేయడానికి పుడుతూ ఉంటారు అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు .

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కేరళ జనాలకు అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం . అల్లు అర్జున్ కోసం ఏమైనా చేసేస్తారు .. ఇన్స్టా లో ఆయనను ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య మిలియన్స్ లోనే ఉంటుంది . తాజాగా బన్నీ ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు .

ఇప్పటివరకు ఇలాంటి క్రేజీ రికార్డు అందుకున్న సౌత్ ఇండియా మొత్తం మొదటి హీరోగా అరుదైన ఘనతను అందుకున్నాడు ఐకాన్ స్టార్ . ఆ తర్వాత స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ 21 మిలియన్ల తో రెండవ స్థానంలో ఉండగా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 20 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 25 మిలియన్ల ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు . ఎంతోమంది అభిమానులు ఆయనను లైక్ చేస్తున్నారు .. కాబట్టే ఇలాంటి ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇ విషయాని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)