కోహ్లీ భార్య పై నీచమైన కామెంట్స్ చేసిన వేణుస్వామీ..అంత మాట అనేశాడు ఏంటి..?

ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టే వేణు స్వామి గతంలో ప్రభాస్ అభిమానులను ఎంత హర్ట్ చేసాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు విరాట్ కోహ్లీ భార్యపై అలాంటి కామెంట్స్ చేయడం అందరికీ షాకింగ్ గా ఉంది. తనను విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి వేణు స్వామి అనుష్క శర్మను వాడుకున్నాడు . స్టార్ క్రికెటర్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ రోహిత్ ప్రదర్శన గురించి కోహ్లీ భార్య గురించి సంచలన కామెంట్స్ చేశాడు .

“అనుష్కలాంటి అందమైన వైఫ్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు అంటే ఎలా ..?”అని ప్రశ్నించాడు వేణు స్వామి. ఆయనను తిట్టే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదు అని గట్టిగా చెప్పాడు . పరోక్షకంగా అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ ను ఈ ఇష్యూలోకి లాగడం అభిమానులకి తీవ్ర హర్టింగ్గా అనిపిస్తుంది . వెంటనే అనుష్క శర్మకు సారీ చెప్పాలి అంటూ విరాట్ కోహ్లీ ఫాన్స్ డిమాండ్ చూస్తున్నారు.

కేవలం ఈ యొక్క విషయమే కాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి . నయనతార – సమంత – నాగచైతన్య -రష్మిక మందన్నా లాంటి స్టార్స్ విషయాలను ఓపెన్గా బయటపెట్టేసాడు . ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు మారుమ్రోగిపోతుంది..!!