వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఎదిగింది. కేవలం ఈమె నటిస్తుందని తెలియ‌డంతో ఆడియన్స్ వళ్ళి సినిమా స‌క్స‌స్ అయ్యిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఆ లెవెల్లో సిల్క్ స్మిత క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా వందల సినిమాల్లో నటించి మెప్పించిన. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

1996లో చెన్నైలో తన నివాసంలోనే సిల్క్ స్మిత ఆత్మహత్యకు పాల్పడింది. కోట్లాదిమంది అభిమానులు ఉన్నా.. సిల్క్ స్మిత అంత్యక్రియలు ఓ అనాధకు జరిగినట్లు జ‌రిగాయి. ఆమెకు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే పోస్టుమార్టం జరిగింది. ఆసుపత్రి సిబ్బందే అంత్యక్రియలు కూడా చేశారని తెలుస్తోంది. ఒక అర్జున్ సజ్జ తప్ప ఆమె అంత్యక్రియలకు ఎవరు హాజరు కాలేదట. సిల్క్ స్మితా మరణించి మూడు దశాబ్దాలు గడుస్తున్నా నేపథ్యంలో.. ఇటీవల సీనియర్ నటి జయమాలిని ఓ ఇంటర్వ్యూలో ఆమె మరణం పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. స్మిత‌ చేసిన ఆ తప్పే ఆమె మ‌ర‌రణానికి కారణమైందని చెప్పుకొచ్చింది. జయ మాలిని మాట్లాడుతూ సిల్క్ స్మితకు తక్కువ టైంలోనే ఫేమ్, డబ్బు వచ్చాయి. షూటింగ్ సెట్స్ లో ఆమె అసలు నాతో మాట్లాడేది కాదు. ఓ సినిమాల్లో సిల్క్ స్మిత, నేను, మా అక్క జ్యోతిలక్ష్మి కలిసి నటించాం.

ఫామ్ లో ఉన్న టైంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆమె చేసిన అతి పెద్ద తప్పు. ప్రేమించడం తప్పు కాదు.. కానీ పేరెంట్స్ కు దూరం అవడం ఆమె చేసిన అసలు తప్పు. సిల్క్ స్మిత తన ప్రియుడిని గుడ్డిగా నమ్మడంతో ఆమె మోసపోయింది. పేరెంట్స్ పక్కనే ఉంటే ఆమెను ఓదార్చేవారు. అయినా తల్లిదండ్రులు వెంట లేనప్పుడు మోసం చేయడానికి ఎంతో మంది సిద్ధమవుతారు. అలానే సిల్క్ స్మితా మీద కూడా బలైపోయింది అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సిల్క్ స్మిత చనిపోయినప్పుడు రాసుకున్న సూసైడ్ నోట్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఓ కోలీవుడ్ స్టార్ హీరో పెళ్లి పేరుతో సిల్స్ స్మిత‌ను మోసం చేశాడ‌ని.. అలాగే ఆమె వద్ద పనిచేసే కొందరు కూడా త‌నను చీట్ చేశారని. ఆమె మరణానికి కారణం కూడా అదేనంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.