పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఆ కోరిక ఇంకా తీరలేదా..? స్టిల్ దాని కోసం వెయిటింగ్గా..?

ప్రశాంత్ నీల్.. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక దర్శకుడు. బడాబడా హీరోలు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .

ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు . ఆ తర్వాత చరణ్ – మెగాస్టార్ చిరంజీవిలతో భారీ మల్టీస్టారర్ ను ఓకే చేసినట్లు సమాచారం అందుతుంది . అందుతున్న సమాచారం ప్రకారం.. ఇలా బడాబడా స్టార్స్ తో కమిట్ అయిన ప్రశాంత్ నీల్.. కోరిక ఇంకా తీరలేదు అన్న న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉందట . ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మంది స్టార్ హీరోస్ ని పెట్టి ఒక బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ రెడీ చేసుకున్నారట . కానీ దానికి అంత మంది పాన్ ఇండియా స్టార్స్ ఒప్పుకుంటారా ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది . ఆ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాడట . అందుకే ఎంత పెద్ద బడా హీరోతో ఆయన సినిమా చేసే ఛాన్స్ వచ్చిన పెద్దగా ఆనందపడడు .. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కితేనే ఆయన ఆనందం అంటున్నారు అభిమానులు..!!