జపాన్‌కు ల్యాండ్ అయ్యిన వెంట‌నే రాజ‌మౌళిని త‌న గిఫ్ట్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన 83 ఏళ్ళ బామా.. ఆమె ప్రేమకు జక్కన్న ఫిదా..

ప్రపంచంలో సినిమా అనేది ఓ పవర్ఫుల్ స్టేజ్‌. వారు తెరకెక్కించే సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లాదిమంది ప్రేక్షకులు.. ప్రపంచవ్యాప్తంగా వారికి కనెక్ట్ అవుతారు. ఎక్కడో తెర‌కెక్కిన‌ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన వారికి, సినిమాలు తీసిన వారికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా జపాన్‌లో దర్శక ధీరుడు రాజమౌళికి జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్ఆర్ సినిమా తీసిన రాజమౌళికి జపాన్‌లో కూడా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఒక మనిషిని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే శక్తి సాహిత్యానికి ఉంటుంది. ఒక సమాజాన్ని ప్రేరేపించే బలం సినిమాకు ఉంటుంది.

అందుకే సినిమాలో నటించిన వారు, సినిమాలు తీసేవారు చాలామంది అభిమానులకు ఆరాధ్య దైవాలుగా మారిపోతూ ఉంటారు. తమ ఫేవరెట్ సెలబ్రిటీస్ కళ్ళ ముందు కనిపిస్తే ఫాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. ఇక మన తెలుగు సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎస్. ఎస్. రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆయనకు అదే రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. దేశ విదేశాలలో ఫ్యాన్స్ కూడా ఆయనను అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. అలా వారి ప్రేమ ఆయనను ఎలా కదిలించిందో రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం తన వైఫ్ రమా తో కలిసి జపాన్‌లో ఉన్న జక్కన.. గ‌తేడాది ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ భాషలో రిలీజ్ చేశాడు.

అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్ కు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కుటుంబాలతో సహా వెళ్లి సందడి చేశారు. ఆ సినిమా అక్కడ ప్రజలను బాగా ఆకట్టుకుంది. భారత్ లోనే కాదు అక్కడ కూడా భారీ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నాటునాటు పాట అక్కడ ప్రజలను మెస్మరైజ్ చేసింది. దీంతో అక్కడ చాలామంది రాజమౌళి ఫ్యాన్స్ గా మారిపోయారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళికి అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఓ 83 ఏళ్ల బామ్మ తన అభిమానాన్ని ఎంతో గొప్పగా రాజమౌళి పై చాటుకుంది. ప్రస్తుతం ఆమె రాజమౌళికి గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన కొన్ని పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ ను జక్కన స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. జపాన్‌లో ఓరగామి క్రేన్ అనే ఓ సాంప్రదాయం ఉంటుంది.

తనకు ఇష్టమైన వారి కోసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ స్వయంగా వారే వీటిని తయారు చేస్తారు. నూతన సంవత్సర సందర్భంగా మనం గ్రీటింగ్స్ కార్డులు పంచుకుంటాం అలా వాళ్లు కూడా ఓర‌గామి క్రేన్లు అందించుకుంటారు. జపాన్లోని ఓ 83 ఏళ్ల బామ్మ రాజమౌళికి అలాంటి ఓరగామి క్రేన్ ను అందించింది. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నాటునాటు పాట ఇప్పటికీ ఎన్నోసార్లు చూశాను. రోజు ఆ పాటను చూడనిదే నా డైలీ రొటీన్ కంప్లీట్ కాదు అంటూ ఆ మహిళ పేర్కొంది. ఇక ఆ ఓరగామి క్రేన్‌లో ఆర్‌ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన కొన్ని దృశ్యాలను ఫోటోల రూపంలో పొందుపరిచి రాజమౌళికి అందించింది. ఆమె ప్రేమకు జక్కన్న ఫిదా అయిపోయారు.