చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు ఓ ప్రముఖ లాయర్.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలలో కనిపిస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలోను ఈమె ప్రేక్షకులను తను నటనతో ఆకట్టుకుంది. ఆమె నటించిన ఓ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ లాయర్ గా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఆమె ఎవరో కాదు జై చిరంజీవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియ శర్మ. ఈ సినిమాతో ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. తను నటించిన మొదటి సినిమాతోనే భారీ ఆఫర్లను అందుకుంది.

ఈ చిన్నది. ఇక జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించి తన ముద్దు ముద్దు మాటలతో చేష్టలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరుసటి ఏడాది నువ్వు నేను ప్రేమ మూవీలో కనిపించింది. అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలుగా మెప్పించింది. రచ్చ, తూనిగా తూనీగా, ఎటో వెళ్లిపోయింది మనసు ఇలా ఎన్నో సినిమాల్లో టీనేజ్ గర్ల్ గా మెరిసింది. కాగా ఈ 26 ఏళ్ల చిన్నది పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. మొదట బిగ్‌బాస్ అలీరేజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత శ్రీకాంత్ కొడుకూ రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలోని మెప్పించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. 2016లో నిర్మల కాన్వెంట్ రిలీజై సక్సెస్ సాధించినప్పటికీ.. తర్వాత శ్రియా శర్మ మరే సినిమాలో కనిపించలేదు. కాగా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లా చదువును పూర్తి చేసి ప్రస్తుతం పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలకు అడ్వకేట్ గా వ్యవహరిస్తుంది.