మొద‌టిసారి సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల‌లో న‌టించ‌క‌పోయినా.. ప‌లు తెలుగు యాడ్ లలో కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్‌ సినిమాలు చేసి త‌న కంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో వ‌రుస సినిమాల‌తో క్రేజి హీరోయిన్‌గా రాణించింది. ఇక ప్రస్తుతం దిక్రూ.. మూవీలో ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రాజేష్ కృష్ణన్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో కొంద‌రు సీనియర్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎయిర్ హోస్టెస్‌గా ముగ్గురు హీరోయిన్లు ప్రయాణీకుల వస్తువులను ఎలా దొంగిలిస్తారు అనే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా రిలాజ్‌కు కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో.. సినిమా ప్రమోషన్స్ స్పీడును మ‌రింత పెంచారు. ఈ నేప‌ద్యంలో సోషల్ మీడియా వేదిక‌గా సినిమాకు సంబంధించిన‌ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు మూవీ టీం.

ఈ క్ర‌మంలో కరీనా త‌న సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని వివ‌రించింది. త్వరలోనే నేను సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఓ స్టార్‌ హీరో నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది మొద‌టి సినిమా. షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌ కోసం ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.. అయితే క‌రీనా న‌టించ‌నున్న ఈ మూవీ ఏదో కాదు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ టాక్సిక్ అని కరీనా ఆ మూవీలో ఓ కీ రోల్‌లో న‌టించ‌నుంద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.