సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క‌ సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌ల‌లో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొంత సినిమాల‌ని ఎప్పటి వరకు థియేటర్లో చూడని వారిలో పవన్ కళ్యాణ్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలు చాలా వరకు థియేటర్లలో చూడలేదని.. ఆ అవకాశం రాలేదని వివరించాడు.

అలాగే హీరోలు మాత్రమే కాదు స్టార్ రైటర్స్ అయినా కొంతమంది తమ సినిమాను చూడాలని భావించినా ఏవో కారణాలతో మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో రైటర్ వక్కాంతం వంశీ ఒకడు. ఆయన స్వయంగా కథ‌ అందించిన అఖిల్ ఏజెంట్ సినిమాను ఇప్పటివరకు ఆయనే చూడలేదట. ఈ సినిమాను అతను చూడకపోవడానికి కారణం మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వంశీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డైరెక్షన్ చేస్తూ బిజీగా ఉండడమేనట. అందుకే దాన్ని చూడలేకపోయారని ఆయన ఒక సందర్భంలో వివరించాడు. వాటిల్లో ఆయన చూద్దామని ఆశపడ్డారట. కానీ ఇప్పటివరకు అది ఏ ప్లాట్ ఫామ్ పై కూడా రిలీజ్ కాలేదు.

ఇక శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా లీడర్ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసింది. అయితే శేఖర్ కమ్ముల దీనిని థియేటర్లో చూడడం మిస్ అయ్యాడట. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పటికో టీవీలో ప్రసారమవుతుంటే దాన్ని చూశానని వివరించారు. అయితే శేఖర్‌కి థియేటర్లో చూసే వీలు ఉన్నా కూడా ఆ సినిమాకు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్‌ రివ్యూస్ రావడంతో సినిమాను చూసి మరిన్ని ఆలోచనలతో మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేక కావాలని స్కిప్ చేశారని తెలుస్తుంది. ఇలా కారణాలు ఏవైనా చాలామంది హీరోలు, దర్శక, నిర్మాతలు ఇప్పటివరకు తమ సొంత సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే ఈ సినిమాలను ఎప్పటికైనా చూడాలని.. అది టీవీలో అయినా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనైనా మరెక్కడైనా.. కూడా చూడాలని వారు భావిస్తార‌ట‌.