అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ స్పెషల్ షో.. ఎంత చార్జ్ చేస్తున్నాడంటే..

ప్రస్తుతం ఇండియా మొత్తంలోనే ఎక్కడా కనీ.. వినీ.. ఎరుగని రేంజ్ లో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ – రాధికా మర్చంట్ల పెళ్లి ఘనంగా జరుపుతున్నాడు. ఇప్పటికే ఈ జంట ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లో జామ్‌నగర్‌లో శుక్రవారం గ్రాండ్ గా మొదలయ్యింది. ఇక ఈ పెళ్ళి వేడుకకు చాలా మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఇలా ఎంతోమంది దేశ విదేశాల నుంచి హాజరుకానున్నారు.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ లో అందరిని ఉషారు ప‌రిచే విధంగా.. ఓ షో ప్లాన్ చేయాలని అంబానీ ఫ్యామిలీ భావించారట. ఇందులో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్ప‌టికే ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో అందరూ ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్న పర్ఫామెన్స్ మాత్రం సల్మాన్ ఖాన్‌ది అంటూ తెలుస్తుంది. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయనున్నాడట‌.

అయితే సాధారణంగా సల్మాన్ ఖాన్ వివాహాలు లేదా ఇతర ఏ ప్రైవేట్ ఈవెంట్లలో పర్ఫామెన్స్ లు చేయాల‌నా దానికి దాదాపు రూ.5 కోట్ల ఫీజు డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక‌ ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళి అంటే ఆ స్టేటస్ ను బట్టి సల్మాన్ ఖాన్ మరింతగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ స్పెషల్ పెర్ఫార్మన్స్ కి సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడట.