నాగచైతన్య తండేల్ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..?!

అక్కినేని నట వారసుడుగా మూడవ తరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తనదైన స్టైల్ లో కథలను ఎంచుకొంటూ వరుస సినిమాల్లో నటిస్తున్న చైతన్య.. తను నటించిన సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. అలాగే కొన్ని సినిమాలతో అక్కినేని ఫ్యామిలీ గౌరవాన్ని మరింతగా పెంచేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ప్రస్తుతం తాండేల్ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

Thandel first look: Naga Chaitanya and Sai Pallavi are patriots in this  action-filled film | Filmfare.com

పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో మొదటిసారి చైతన్య పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఇక ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు చాలా వరకు సాయి పల్లవి క్యారెక్టర్ ప్లస్ అవ్వనుంట‌. ఇదిలా ఉంటే దర్శకుడు చందు మండేటి మూవీ ఇంటర్వెల్ సీన్లో భారీ ట్విస్ట్‌ ఇవ్వబోతున్నాడట. అయితే ప్రస్తుతం ఆ ఇంటర్వెల్ లీక్స్ తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ మూవీ ఇంటర్వెల్ టైంలో సాయి పల్లవి క్యారెక్టర్ చనిపోతుందట. దాంతో సినిమా మరో మూడులోకి వెళ్ళిపోతుందని సమాచారం.

Sai Pallavi as Satya, Essence of Thandel on 5th January

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కాగా ఈ సినిమాతో నాగచైతన్య, చందు మండేటి భారీ సక్సెస్ కొట్టబోతున్నాం అంటూ గట్టి నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి బతుకుతుందా లేదా అనేది మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి పల్లవి ఇంటర్వెల్ సీన్‌లోనే చనిపోతుందంటూ వార్తలు వినపడడంతో.. సాయి పల్లవి ఫ్యాన్స్ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు. సినిమా మధ్యలోనే హీరోయిన్ క్యారెక్టర్ ను తీసేస్తే ఇంకా ఆ సినిమా ఆడిన‌ట్లే అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.