గ్లామర్ డోస్ ఇంకా పెంచుతా.. మీకేంటి ప్రాబ్లం.. టిల్లు గాడి లిల్లీ బోల్డ్ కమెంట్స్..

కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ డీజె టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్ అయింది. ఇప్పటికే రాధిక టికెట్ కొనకుండా.. అనే సాంగ్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఓ మై లిల్లీ అనే పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో గ్రాండ్ లెవెల్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ రామ్‌మాలిక్, నిర్మాత నాగవంశీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. వీరికి మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Anupama Parameswaran's bold avatar in Tillu Square becomes a talking point  | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ నేపథ్యంలో అనుపమ గ్లామర్ డోస్ ఒక‌సారిగా పెంచారేంటి అని ప్ర‌శ్నించ‌గా.. గ్లామర్‌గా కనిపించడం మంచిదే కదా.. మరింత అందంగా క‌నిపిస్తా. నా సినీ కెరీర్‌లో నేను న‌టించిన‌ రోల్స్ అన్నింటిలో లిల్లీ పాత్ర చాలా స్పెషల్. మూడేళ్ల నుంచి డిఫరెంట్ రోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా. అంతకు ముందు కొన్ని పరిమితులు పెట్టుకొని ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి అని చాలా పాత్రలను వదిలేసుకున్నా. అయినా అన్ని సినిమాలు ఒకేలాంటి పాత్రలో కనిపిస్తే బోర్ కొడుతుంది. అలాగే నటనకు ఇంపార్టెన్స్ అనిపిస్తే ఏ సినిమా అయినా చేస్తా.. హీరోయిన్ ఇమేజ్ కోసం కాదు అంటూ అనుపమ వివరించింది. ఇక సినిమా కదా ఎంచుకోవడానికి కారణమేంటి.. ఇతర హీరోయిన్ల వద్దన్న సినిమాను మీరెలా చేశారని.. మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయింది.

Tillu's New GF Anupama Parameswaran: Hit or Miss?

ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ.. నా వద్దకు స్టోరీ వచ్చింది. నాకు నచ్చింది. ఆ రోల్ వదులుకోకూడదనిపించింది ఓకే చేసేసా. అంతే మిగతా విషయాలన్నీ నాకు తెలియదు. నా సినీ కెరీర్‌ ప్రారంభమై పదేళ్లు అవుతుంది. ఎప్పుడు ఒకేలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం తప్పు కదా.. అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి ఈవెంట్ ఇదే అయితే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన‌ రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటినుంచి ఒక్క ఈవెంట్ కూడా మిస్ కాకుండా పాల్గొంటానని వివరించింది. ఇక సిద్దు మాట్లాడుతూ డిజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ మరింత రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తుందని వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 29న రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫోర్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.