రమ్యకృష్ణ సరసన.. అన్న, భర్త, తండ్రిగా నటించిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల‌లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1985లో భ‌లే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఐరన్ లేడీగా విమర్శలు అందుకున్నప్పటికీ.. తర్వాత కే.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెర‌కెక్కిన అల్లుడుగారు సినిమాతో ఈమె కేరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్క్స్ పడడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత రాఘవేందర్రావు దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

ఫ్యామిలీ,ల‌వ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పాత్రలోనూ మెప్పించింది. అలాగే విలన్‌గా నెగటివ్ రోల్స్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో రమ్యకృష్ణ భార్యగా, చెల్లిగా, కూతురుగా కూడా ఓ నటుడి సరసన నటించి మెప్పించింది. అలా అన్ని పాత్రల్లో రమ్యకృష్ణ తో కలిసి నటించిన ఏకైక నటుడు ఎవరో ఒకసారి చూద్దాం. అతను ఎవరో కాదు మంచి పాత్రలతో పాటు నెగటివ్ షేడ్స్ లోను నటించిన నాజర్. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించింది.

ఈ సినిమాల్లో బిజ్జాల దేవుడుగా నాజర్ మెప్పించారు. ఇందులో రమ్యకృష్ణ భర్త పాత్రను ఆయన పోషించాడు. అలాగే రజనీకాంత్ హీరోగా వ‌చ్చిన‌ నరసింహా మూవీలో రమ్యకృష్ణకు అన్నగా నాజర్ నటించాడు. అలాగే రమ్యకృష్ణ నటించిన తమిళ్ మూవీ రాజవతాన్ వరువేన్ మూవీలో ఆమె నాజ‌ర్ కూతురి పాత్రలో మెప్పించింది. ఇలా రమ్యకృష్ణకు తండ్రిగా, అన్నగా, భర్తగా నటించిన ఏకైక నటుడిగా నాజర్ పేరు సంపాదించుకున్నారు.